Tuesday, August 18, 2026
HomeTelanganaఘనంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రథమ మహాసభ

ఘనంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రథమ మహాసభ

📰 Generate e-Paper Clip

భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్‌టియు జిల్లా ప్రథమ మహాసభ ను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మేకల రామన్న, భావన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎదునురి రమేష్ సభకు అధ్యక్షత వహించారు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్‌టియు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ మినీఫంక్షన్ హాల్ లో మహాసభ నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మేకల రామన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎదునురి రమేష్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ మహాసభకు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్, మరియు సీనియర్ జర్నలిస్ట్ ఎండి. మునీర్ ముఖ్య అతిథి గా హాజరై ఐఎఫ్‌టియు మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ ను ప్రారంభించారని తెలిపారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ తీర్మానాలు వారి డిమాండ్లు తెలియపరిచారు. భవన నిర్మాణ కార్మికులకు బీడీ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు స్కీం వర్కర్లకు కనీస వేతనాలు వారి సామాజిక భద్రతకు సంబంధించిన కనీస చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ప్రమాద భరితమైన పనుల్లో నిమగ్నమై ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా పథకం కింద 15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 5000 పెన్షన్ ఇవ్వాలని అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదస్తు అంగవైకల్యం జరిగిన హమాలి కార్మికుడికి ఐదు లక్షలు అందించాలని, హమాలి కార్మికులకు లెబర్ కార్డు అందించాలని, హమాలి కార్మికులకు ఫ్రీ వైద్య సదుపాయం కల్పించాలని, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 60 అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని అమలు చేయాలని, మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని వెంటనే ఏర్పాటు చేయాలని, మంచిర్యాల నుండి చెన్నూర్ వెళ్ళే ఓవర్ బ్రిడ్జ్ ఫోర్వే లైన్ వెంటనే నిర్మించాలని తెలిపారు.

ఈ మహాసభలో ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎల్ కృష్ణ ఉపాధ్యక్షుడు కె విశ్వనాథ్ తదితరులు ప్రసంగించారని. అనంతరం మహాసభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నదని ఐఎఫ్‌టియు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మేకల రామన్న, కార్యదర్శిగా ఏదునూరి రమేష్, ఉపాధ్యక్షుడిగా కే దేవయ్య, సహాయ కార్యదర్శిగా బి గోపీనాథ్, లతోపాటు తో మొత్తం 11 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.