Monday, August 17, 2026
HomeDelhiసీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణ పనుల పరిశీలన

సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణ పనుల పరిశీలన

📰 Generate e-Paper Clip

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు వసంత్ విహార్ లో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు పర్యవేక్షించారు.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: దేశ రాజధాని దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండో రోజు వసంత్ విహార్ లో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుని దసరా పండుగ రోజు అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన దిల్లీ వచ్చారు. నిన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ పనులు పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇవాళ వసంత్ విహార్ లో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు కేసీఆర్.. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో అన్ని అంశాలు పరిశీలించి వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.