
టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న టి.ఎస్.పి.ఎస్.సి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో పకడ్బంధీగా నిర్వహించాలని టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ బి. జనార్ధన్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి టి.ఎస్.పి.ఎస్.సి. కార్యదర్శి అనిత రామచంద్రన్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లు, అదనపు కలెక్టర్లు, ముఖ్య పర్యవేక్షకులు, లైసన్, అసిస్టెంట్ లైసన్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ మాట్లాడుతూ.
పరీక్షల నిర్వహణ ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పకడ్బంధీగా చేపట్టాలని, 503 పోస్టులకు గాను 3 లక్షల ట్ùఎహె8లోల్లి పొస్ట్య్౭జ80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు 2 లక్షల 43 వేల మంది అభ్యర్థులు హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ నుండి హాల్టిక్కెట్లు డోర్లాడ్ చేసుకోవాలని తెలిపాజరు. ఈ నెల 16న ఉదయం 10.30 గం||ల నుండి మధ్యాహ్నం 1 గం||ల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 8.30 గం||ల నుండి అనుమతించడం జరుగుతుందని, నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని, తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలు చేయడం. జరుగుతుందని, ఉదయం 10.15 గం॥ల తరువాత లోనికి అనుమతించడం జరుగదని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రైటింగ్ ప్యాడ్లు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదని, నిషేధించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు ఒక గుర్తింపు కార్డు ఒరిజినల్( ఆధార్ /పాన్/ ఓటర్/ ఎంప్లాయ్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్ పోర్ట్) తీసుకురావాలని, హాల్టికెట్పై ఫోటో/సంతకం లేని పక్షంలో వారు గెజిటెడ్ అధికారిచే సక్రమంగా ధృవీకరించిన 3 పాస్పోర్ట్ ఫోటోలు, నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్ష కేంద్రంలో అప్పగించాలని తెలిపారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించే ముందు పరీక్ష వేదిక ప్రవేశద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని, బూట్లకు అనుమతి లేదని, పరీక్ష కోసం బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని, దివ్యాంగ అభ్యర్థులకు గ్రౌండ్ఫోర్లో వసతి కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు హాల్టికెట్ నెంబర్, ఓ.ఎం.ఆర్. జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వ్రాయాలని, ప్రశ్నాపత్రం సిరీస్ ఏ, బి, సి, డి బదులుగా ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిందని తెలిపారు, ఓ.ఎం.ఆర్. జవాబు పత్రంపై వైటనర్ / చాక్ పవర్ / బ్లేడ్ / ఎరేజర్ ఉపయోగించరాదని, పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులను పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించరని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీప ప్రాంతాలలో ఫొటోస్టాట్ / జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ ఇతరత్రా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో 9 వేల 252 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందు కొరకు 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షక అధికారి, సహాయ లైసన్ అధికారి, రెండు / మూడు కేంద్రాలకు ఒక లైసన్ అధికారితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. అన్ని ముఖ్య పర్యవేక్షణ అధికారి గదులతో పాటు అన్ని పరీక్ష కేంద్రాలలో సి.సి. కెమెరాలను, జిల్లా కలెక్టరేట్ భవనంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థుల కొరకు గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించడం జరిగిందని, అంధ అభ్యర్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎ.సి.పి.లు తిరుపతిరెడ్డి, ఎడ్ల మహేష్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
