Friday, July 3, 2026
HomeTelanganaటపాసులు దుకాణాలకు అనుమతి తప్పనిసరి

టపాసులు దుకాణాలకు అనుమతి తప్పనిసరి

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, నగర పాలక, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనుమతి లేకుండా అమ్మిన, బాణసంచా నిల్వ చేసినా తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా విక్రయదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎసిపి సూచించారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.