Wednesday, August 19, 2026
HomeTelanganaబి.సి. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

బి.సి. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

📰 Generate e-Paper Clip

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. వినోద్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, బి.సి. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెన్ పరీక్షలకు లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి బి.సి. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెన్కు లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ఆన్లైన్లో https://tsbcstudycircle.cgg.gov.in, https:/ /studycircle.cgg.gov.in/tsbsw వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈ నెల 25వ తేదీన ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి ఈ నెల 29వ తేదీన ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతుందని, మే 20వ తేదీ వరకు శిక్షణ ముగుస్తుందని, ఈ శిక్షణ హైదరాబాద్ లోని ఓ.యు. కేంద్రంలో 200 మందికి, హన్మకొండలో 100 మందికి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.