Wednesday, August 19, 2026
HomeTelanganaఒప్పంద పద్దతిన పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తుల స్వీకరణ

ఒప్పంద పద్దతిన పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆమోదం మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని హెచ్.డబ్ల్యు.సి.లలో 37 ఎం.ఎల్.హెచ్.పి.ఎన్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత నోటిఫికేషన్, దరఖాస్తు ఫారములు ఆన్లైన్ లో  www.mancherial.telangana.gov.in. వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 9వ తేదీ నుండి 17వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా పని వేళల యందు జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నందు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు రుసుము 500 రూపాయలు ఏదేని జాతీయ బ్యాంకు నందు డి.డి. రూపంలో చెల్లించాలని, షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంటుందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.