సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పిఏ కు వినతిపత్రం ఇచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్.
11వ పీఆర్సీ ని అమలు చేయాలి.
జివో నెంబర్ 4 ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
మంచిర్యాల జిల్లా: తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే , పిఏ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో వివిధ కేటగిరిలో పని చేస్తున్నా ఎంప్లాయిస్ & వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.గత 2 సంవత్సరాలుగా కరోనా విపత్తులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి మున్సిపల్ కార్మికుల వలే వేతనాలు పెంచాలి. జివో నెంబర్ 4 ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు అమలు చేయాలి. జివో నెంబర్ 51 ని సవరించి, మల్టీపార్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎస్క్ డే రూ,,2 లక్షలు ఇన్సూరెన్స్ ను రాష్ట్రంలో అమలు చేయాలి. పీఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి.8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్షగ్రెషియా చెల్లించాలి. తొలగించిన పంచాయతీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ రాజలింగు, లింగయ్య, సాయి కృష్ణ,లచ్చయ్య, మొండయ్య, మొగిలి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
