
మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ గురువారం ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిఐఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంకు సంబంధించిన టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వెంటనే ఇంటర్ విద్యా శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తోట రాజేష్, మనోహర్, చిప్పకుర్తి శ్రీనివాస్, జిలకర సిద్ధార్థ, బచ్చల ప్రవీణ్, కుమారస్వామి పాల్గొన్నారు..

