Tuesday, August 18, 2026
HomeDelhiకాంగ్రెస్ కు మరో షాక్..?

కాంగ్రెస్ కు మరో షాక్..?

📰 Generate e-Paper Clip

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా

దిల్లీ: కాంగ్రెస్ కు భారీ షాకిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. ‘యువత ఆకాంక్షలు నెరవేరేలా పార్టీ నిర్ణయాల్లో స్పష్టత ఉండటంలేదు’. అని అన్నారు. ‘గాంధీ త్రయాలను ఏడాది కాలంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు అనుమతి ఇవ్వడంలేదని ఈ సందర్భంగా షెర్గిల్ ఆరోపించారు.

‘క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, కాంగ్రెస్ నిర్ణయాలకు పొంతన కుదరడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసి మాట్లాడేందుకు ఏడాదికి పైగా ప్రయత్నిస్తున్నా. మమ్మల్ని కలిసేందుకు వారు సిద్ధంగా లేరు’ అని పేర్కొన్నారు. ‘గత ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి ఏం ఆశించలేదు. కాంగ్రెస్ అభ్యున్నతికే పాటుపడ్డా. పార్టీ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉన్నవారి వద్ద తలవంచాల్సి వస్తోంది. అది నాకు ఎంతవరకూ ఆమోదయోగ్యం కాదు’ అని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపించారు. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలను అందులో వివరించినట్లు తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.