
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు గ్రామ రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ.)లను కేటాయిస్తూ పునర్విభజన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి వివిధ శాఖలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిన పూర్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జిల్లా, డివిజనల్, మండల స్థాయి కార్యాలయాలలో 104 ఖాళీలలో సిబ్బంది భర్తీ చేయవలసి ఉండగా 99 స్థానాలలో పూర్తి చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ-2, రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీన్-1, పశు సంవర్ధక శాఖ-1, మత్స్యశాఖ-1, పర్యావరణ, అటవీ, శాస్త్ర-సాంకేతిక శాఖ-1, సాధారణ పరిపాలన క్రింద గల సమాచార, పౌరసంబంధాల శాఖ- 1, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ-10, ఉన్నత విద్య శాఖ– 17, ప్రాసె క్యూషన్స్-2, సైనిక్ వెల్ఫేర్-1, పరిశ్రమల శాఖ-1, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖ-5, పురపాలక, పట్టణాభివృద్ధి-35, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ-21, రవాణా, రోడ్లు-భవనాల శాఖ-2, గిరిజన సంక్షేమశాఖ-1, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ-2 సిబ్బంది కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రాజన్వ మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా రవాణా అధికారి కిష్టయ్య, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
