
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా: జిల్లాలో వరద ముంపు బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల చెన్నూర్ నియోజకవర్గ ములోని అనేక మండలాల్లో కురిసిన వానలు, వరదలకు భారీ నష్టం చూడవలసి వచ్చిందని అన్నారు.. మంచిర్యాలలో ముఖ్యంగా విలువైన వస్తువులు ,ఆస్తి ,గృహ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామాల్లో పంటల్లో నీళ్లు చేరి నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. దండెపల్లి, లక్షటిపేట ప్రాంతాల్లో గూడెం, నంబాల ఎత్తిపోతల పథకాల పైపులు, మోటార్లు కొట్టుకుపోయాయని ట్రాన్స్ఫార్మర్లు సిమెంటు బేసిమ్మెటతో సహా కూలిపోయాయని ఆయన చెప్పారు. వరద బాధితులకు తక్షణ సహాయం అందించి నష్టపోయిన వారికి పరిహారాన్ని చెల్లించాలని ఆయన కోరారు. అలాగే మంచిర్యాలలో గోదావరి తీరాన నిర్మించిన మాత శిశు కేంద్రాన్ని ఇతర కార్యకలాపాలకు వాడుకోవాలని ఆయన సూచించారు.
మాత శిశు కేంద్రాన్ని ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం నిర్మిస్తున్న భవనంలోకి మార్చాలని అందుకు అనువైన నిర్మాణం జరపాలని ఆయన కోరారు. కడెం గేట్లను మరమ్మత్తు చేయించలేని ప్రభుత్వం తీరూ వల్లనే వరదలు ముంచుకొచ్చాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు వరద బాధితులకు సహకారం అందిస్తే అధికార పార్టీ శ్రేణులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో సూచించిన సమస్యలకు పరిష్కారం లభించకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని అవసరమైతే ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
