Monday, August 17, 2026
HomeCrimeఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా..?

ఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా..?

📰 Generate e-Paper Clip

సిఐ నాగేశ్వరరావు

జైలులో పోలీసు అధికారి బిందాస్!

హైదరాబాద్: మహిళపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన సీఐ నాగేశ్వరరావు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. చర్లపల్లి జైలులో సిబ్బంది, తోటి ఖైదీలతో సరదాగా కబుర్లు చెబుతున్నట్లు సమాచారం. తప్పు చేశాననే పశ్చాత్తాపం కూడా కనిపించలేదని తెలుస్తోంది. తనకేం కాదనే ధీమాగా ఉన్నాడని, అక్కడి సిబ్బందితో తాను తేలికగా కేసు నుంచి బయటపడతానంటూ చెబుతున్నట్లు తెలిసింది. సంచలనం రేకెత్తించిన కేసులో మరిన్నివివరాలు రాబట్టేందుకు వారం కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు గురువారం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం శుక్రవారమే నాగేశ్వరరావును కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతిచ్చిందని, ఈ మేరకు జైలులో ఉన్న అతడికి నోటీసులు కూడా జారీచేసినట్లు సమాచారం. పోలీసులు మాత్రం కస్టడీ పిటీషన్ పై సోమవారం విచారణ జరుగుతుందంటున్నారు.

కస్టడీకి తీసుకున్న తరువాతనే కేసు రీ కనస్ట్రక్షన్ చేస్తామంటున్నారు. కస్టడీకి అనుమతినిచ్చినా అదుపులోకి తీసుకోలేదనే ఊహాగానాలను పోలీసు అధికారులు కొట్టిపారేస్తున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.