
మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలో కోయపోషగూడెం పోడు భూముల పోరాటం ఉగ్రరూపం దాలుస్తుంది. పోడు పోరులో భాగంగా శుక్రవారం ఫారెస్ట్ & పోలీస్ భారీ బలగాలకు ఆదివాసీ మహిళలకు పెద్దఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. మళ్ళీ ఐదుగురు మహిళలను ఇడ్చుకుంటూ జీపుల్లో వేసుకొని వెల్లి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తాళ్లపెట్ రేంజ్ కార్యాలయం ముందు ప్రధాన జాతీయ రహదారి పై ఆదివాసీ నాయకులు కూర్చొని రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు మాడవి వెంకటేష్ మాట్లాడుతూ… అరెస్టు అయిన గిరిజన మహిళలను బేషరుగా వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పై కెసిఆర్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమం పార్థాన్ ప్రోహిత్ సేవాసంగ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఆడాయి కాంతారావు, మాజీ సర్పంచ్ లింగారావు, కనక జంగు కుడిమేత లక్ష్మణ్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
