
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్ హెచ్ఎస్ఐసీసీ నోవాటెల్ చుట్టు పక్కల 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రధాని సహా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్న దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు.
మరో వైపు జులై 1 నుంచి 4వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని సీపీ ఆదేశాలు జారీ చేశారు..
