Monday, August 17, 2026
HomeTelanganaదేశంలో సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

దేశంలో సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే సాధ్యమని మాజీ మంత్రి బోడ జనార్ధన్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు చూడలేక తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు, ప్రస్తుతం వారు సంపాదించిన ఆస్తులకు చెల్లిస్తున్న ఆదాయ పన్నుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలిచేందుకు కృషి చేస్తానని బోడ జనార్ధన్ తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.