Friday, July 3, 2026
HomeWorldచీపురు పట్టి గుడిని శుభ్రం చేసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి..!

చీపురు పట్టి గుడిని శుభ్రం చేసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి..!

📰 Generate e-Paper Clip

రాయ్ రంగ్ పూర్: ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మూ. ఆమె గెలుపు నల్లేరుపై నడకే. ఆ స్థాయి వ్యక్తి గుడిలో తన నిరాడంబరతను చాటుకున్నారు. తన ఎంపికను పురస్కరించుకొని బుధవారం శివాలయానికి వెళ్లిన ఆమె.. స్వయంగా చీపురు పట్టి, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇప్పటికే అనేక పదవులు చేపట్టిన ఆమె.. ఆ హోదాల్నీ పక్కన పెట్టి, ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం. ద్రౌపది ముర్మూ ఈ రోజు తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన రాయిరంగ్ పూర్ లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా.. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Post Midle

ముర్మూకు జడ్ ప్లస్ భద్రత..?

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ముర్మూకు కేంద్రం ఈ రోజు జడ్ ప్లస్ భద్రత కల్పించింది. దాంతో సీఆర్పీఎఫ్ కమాండోలు ఆమెకు రక్షణ కవచంలా ఉంటారని సంబంధిత అధికారులు వెల్లడించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్.. వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత స్థాయి రక్షణ కవచం..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.