
దిల్లీ: నిత్యావసరాల ధరల మోతతో అల్లాడిపోతున్న వేళ ఇంధన తయారీ సంస్థలు ఓ శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ (Commercial cylinder) ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై రూ. 135 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. ఈ తగ్గింపు నేటి(జూన్ 1) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ (Commercial cylinder) ధర రూ.2,335.50 నుంచి రూ.2,219కు దిగొచ్చింది. ముంబయిలో ఈ సిలిండర్ ధర<span;><span;> <span;>రూ.2,171.50, కోల్కతాలో రూ.2,322, చెన్నైలో రూ.2,373గా ఉంది. హైదరాబాద్ లో ఈ సిలిండర్ ధర రూ.2,427.50కు తగ్గింది. చమురు సంస్థల నిర్ణయంతో చిరు వ్యాపారులు, హోటల్ యజమానులకు కాస్త ఊరట లభించినట్లయింది.
అయితే, గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల (Domestic Gas Cylinder) ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,003 ఉంది. అయితే, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే..
