Tuesday, August 18, 2026
HomeWorldఉదయాన్నే నిద్రలేచి ఇలా చేస్తే ఎన్నో లాభాలు..!

ఉదయాన్నే నిద్రలేచి ఇలా చేస్తే ఎన్నో లాభాలు..!

📰 Generate e-Paper Clip

ఉదయం లేవగానే చేసే పనులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

• లేవగానే ఒకటి, రెండు గ్లాసుల మంచినీరు తాగాలి. శరీరంలో హైడ్రేషన్ పెంచే నీటితో జీవక్రియను ప్రారంభిస్తే మేలు చేస్తుంది.

• అదనపు శక్తిని పెంచుకోవడానికి అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి.

• ఉదయం ధ్యానానికి 10 నిమిషాల సమయం కేటాయిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

• ఒంటికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

• శరీరానికి తప్పనిసరిగా శ్రమను అలవాటు చేయాలి.

• పొద్దున్నే భారీ బరువులు మోయకూడదు. తేలికపాటి బరువులు మోయాలి. శరీరంలో రక్త ప్రసరణ పెరిగితే స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది.

• ప్రోటీన్లతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజంతా శక్తినిస్తుంది.

• ఇష్టపడే వ్యక్తులతో ఉదయం కొద్దిసేపు గడపాలి. కుటుంబంతో కలిసి టిఫిన్ తినడం, స్నేహితులతో కలిసి వ్యాయామం చేయడం మంచిది.

• ఉదయాన్నే బొమ్మలు గీయడం, చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పెరటి తోటల పర్యవేక్షణ చేయడంతో ఉల్లాసంగా ఉంటుంది.

• ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని ఇతరుల స్టేటస్, టెక్స్ట్ చూడొద్దు. అలా చేస్తే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇతరుల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కదారి పడుతాయి.

• ఉదయం 8 గంటలలోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఇలా చేస్తే అనుకున్న విజయాలు సాధించడానికి వీలవుతుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.