Thursday, October 22, 2026
HomeTelanganaమంచిర్యాల కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు!

మంచిర్యాల కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు!

📰 Generate e-Paper Clip

మంచిర్యాలలో రాజకీయ ఉత్కంఠ

మంచిర్యాల అక్టోబర్ 21, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు క్రమంగా కార్యకర్తల స్థాయికి చేరుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సద్దుల బతుకమ్మ రోజున తాళ్లపేటలో చోటుచేసుకున్న వివాదం మరువకముందే.. దసరా రోజున మరో గొడవ తెరపైకి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. వివాదాల పరంపర.. పరస్పర ఆరోపణలు.! నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఒక వర్గంపై మరో వర్గం దాడికి దిగిందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలకు సంబంధించి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రావు ఇంటి వద్ద పోలీసు పహారా.! మంచిర్యాల కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రావు నివాసంపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు వర్గీయులు దాడికి పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ.! వరుస వివాదాలు, పరస్పర ఆరోపణలు మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గ విభేదాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. అధికార పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అధిష్ఠానం జోక్యంతో పరిస్థితి సద్దుమణుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.