మంచిర్యాల కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు!

మంచిర్యాలలో రాజకీయ ఉత్కంఠ మంచిర్యాల అక్టోబర్ 21, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు క్రమంగా కార్యకర్తల స్థాయికి చేరుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సద్దుల బతుకమ్మ రోజున తాళ్లపేటలో చోటుచేసుకున్న వివాదం మరువకముందే.. దసరా రోజున మరో గొడవ తెరపైకి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. వివాదాల పరంపర.. పరస్పర ఆరోపణలు.! నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయనే చర్చ రాజకీయ...