Saturday, September 5, 2026
HomeTelanganaఉపాధ్యాయుల సేవలకు లయన్స్ క్లబ్ ఘన సత్కారం

ఉపాధ్యాయుల సేవలకు లయన్స్ క్లబ్ ఘన సత్కారం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, సెప్టెంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )

భారత మాజీ ఉపరాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి శ్రీమతి మాళవి దేవి, ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల్లో సేవలందిస్తున్న ఆరుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. బాయ్స్ హైస్కూల్‌కు చెందిన శ్రీ వి. వెంకటేశ్వర్, కొల్లంగూడ ప్రైమరీ స్కూల్‌కు చెందిన శ్రీ ఎస్. వెంకటయ్య, దొనబండ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శ్రీ లక్ష్మీనారాయణ, నస్పూర్ ఎంపీపీఎస్‌కు చెందిన శ్రీమతి అన్నం శిరీష, గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన శ్రీమతి గంగుతాయి దేశ్‌పాండే, రామారావుపేట ఎంపీయూపీఎస్‌కు చెందిన శ్రీ కే. రాజులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి, లయన్స్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. అలాగే కార్యక్రమానికి హాజరైన ముఖ్యఅతిథి, ప్రత్యేక ఆహ్వానితులను కూడా లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి తవటం శ్రీనివాస్, కోశాధికారి లయన్ ఏ. వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం చైర్‌పర్సన్ లయన్ పి. ప్రభాకర్ రావు, రీజన్ చైర్‌పర్సన్ లయన్ చక్రధర్ రావు, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి, వినయ్ కుమార్, బేగ బాబు, సిరిపురం శ్రీనివాస్, చందూరి మహేందర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఎంతో అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలను స్మరించుకోవడమే ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.