ఉపాధ్యాయుల సేవలకు లయన్స్ క్లబ్ ఘన సత్కారం

మంచిర్యాల, సెప్టెంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ ) భారత మాజీ ఉపరాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి శ్రీమతి మాళవి దేవి, ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...