Tuesday, August 18, 2026
HomeTelanganaముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: యూఎస్ఎఫ్ఐ

ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: యూఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోకుండా కొన్ని పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని విమర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వం పర్యవేక్షణను పెంచి సాధారణ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని మణిచరణ్, మనోహర్, వాణి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.