Monday, August 17, 2026
HomeTelanganaవేలాల గ్రామంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహణ

వేలాల గ్రామంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వేలాల గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికతల నడుమ శ్రీ శ్రీ వేలాల మల్లన్న స్వామి ఆలయంలోని హనుమాన్ ఆలయం ముందర శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అనేది శ్రీరాముడు–సీతమ్మల దివ్య కలయికకు ప్రతీకగా భావించబడే పవిత్ర వేడుక. ఈ మహోత్సవాన్ని దర్శించుకోవడం ద్వారా దాంపత్య సౌఖ్యం, శాంతి, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈవో రమేష్, ఉప సర్పంచ్ సుందిళ్ల రాజలింగు, వార్డు సభ్యులు, ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో కళ్యాణం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయగా, భక్తులు భారీగా పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.