Wednesday, August 19, 2026
HomeTelanganaరంగుల కేళీ… హోళీ సంబరాలు అంబరాన్నంటినవి

రంగుల కేళీ… హోళీ సంబరాలు అంబరాన్నంటినవి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం సిసిసి నాస్పూర్‌లో మంగళవారం హోళీ పర్వదినం సందర్భంగా హోళీ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు, యువత, పెద్దలు ఒకేచోట చేరి పరస్పరం రంగులు చల్లుకుంటూ హోళీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంగుల హరివిల్లుగా మారిన నాస్పూర్ ప్రాంతం సందడితో కళకళలాడింది. హోళీ పండుగను వసంతఋతువు ఆగమనానికి సంకేతంగా భావిస్తారు. చెడుపై మంచికి విజయం సాధించిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. పరస్పర భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పండుగగా హోళీకి ప్రత్యేక స్థానం ఉంది. ముందురోజు హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరుసటి రోజు రంగులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, రజిత, విజయ్, వాణి, సాగర్, మౌనిక, సంతోష్, కార్తీక, బిక్షపతి, అనూష, అజయ్, రాణి, శ్రీనివాస్, భార్గవి, ముషం రాజమల్లు, నాగమణి, రాజ్‌కుమార్, మంజుల, కర్ణాకర్, సమత, వేణు, లక్ష్మీ, రాజ్‌కుమార్, సుధతో పాటు పలువురు చిన్నారులు పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు.

హోళీ పండుగను శాంతి, యుత వాతావరణంలో జరుపుకోవాలని, సహజ రంగులను ఉపయోగించాలని నిర్వాహకులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.