Monday, August 17, 2026
HomeTelanganaతాహసిల్దార్ కార్యాలయంలో దళారుల దందా

తాహసిల్దార్ కార్యాలయంలో దళారుల దందా

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని ఓ తహసిల్దార్ కార్యాలయంలో దళారుల దంద దర్జాగా సాగుతుంది. సదరు తాసిల్దార్ కార్యాలయంలో ఏ పని కావాలన్నా మామూలు ఇస్తేనే పని అవుతుందనే ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి. సూర్యాస్తమయం కాగానే ప్రతి కార్యాలయం మూసిపోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ రాత్రి 10 గంటల వరకు సదరు తహసిల్దార్ కార్యాలయం తెరుచుకొని ఉండి రాత్రిపూట వారి దొంగ పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు వారి అవసరాల కోసం కార్యాలయాలు చుట్టూ ప్రతిరోజు చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోని అధికారులు , మరి ఏ పనుల కోసం తహసిల్దార్ కార్యాలయంలో అంత ఉత్సాహంగా రాత్రి వరకు ఉంటూ పనులు చేస్తున్నారో వారికే తెలియాల్సి ఉంది. పెద్ద కార్యాలయాల్లో సైతం సాయంత్రం ఐదు గంటల ముందే ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు జిల్లాలోని ఒక తాసిల్దార్ కార్యాలయం ఉద్యోగులు మాత్రం రాత్రి 8 గంటలు ఐన కార్యాలయంలోనే ఉండడం పట్ల పలు విమర్శలు గత రెండు సంవత్సరాల నుండి వస్తున్నాయి. జిల్లాలోని సదరు తహసిల్దార్ కార్యాలయంలో ఒకే వర్గానికి చెందిన ఉద్యోగులందరూ ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంది. కాంట్రాక్టు పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు తామే పర్మినెంట్ మా కమ్యూనిటే రాజ్యం అన్నట్లు ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన ఏదో ఒక అధికారితోని మంచి పరిచయం, ఎప్పుడు ఎవరితోని అవసరం పడుతుందో అని సైలెంట్ గా ఉంటున్నారు.

• యదేచ్ఛగా దళారుల దందా..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ తహసిల్దార్ కార్యాలయంలో దళారుల దంద యదేచ్చగా సాగుతుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసిల్దార్ కార్యాలయంలోనే చేసుకొనే వీలు ఉండడంతో దళారులు రెచ్చిపోతున్నారు. ఏజంట్లుగా మారి గ్రామీణ ప్రాంతాలలో కొందరు అమాయక రైతుల అవసరాలను కాపు కాచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. రైతుల పనులు చేసి పెడితే అధికారికి , కంప్యూటర్ ఆపరేటర్ కు మామూల్లు ఇస్తూ చక చక పనులు చేసుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడా పెడుతున్నారు కాబట్టే సదరు కంప్యూటర్ ఆపరేటర్ల కళ్ళు తలకెక్కినాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను వెనుకేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళారులందరూ సదరు తాసిల్దార్ కార్యాలయంలో ఎప్పుడు చూసినా ఉండడం, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని సలహాలు ఇవ్వడం ఇక్కడ షరా మామూలుగానే మారిపోయింది. పెద్దోడు కూడా వసూల్ రాజానే కావడంతో వీరికి భయం లేకుండా పోయింది. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేపట్టి ఇలాంటి కార్యాలయాల పైన చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.