కొమరం భీం కాలనీలో ఆగస్టులోనే గడువు ముగిసినా.. ఫ్రిజ్ లో నిల్వ ఉంచగా.. పట్టుబడిన ఐస్క్రీమ్, పండ్ల రసాల తయారీలో వినియోగించే పదార్థం..

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాసుల కోసం కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతున్నారు.. గడువు మీరిన పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇటీవల కుమురం భీం జిల్లా కూడలిలో గతేడాది ఆగస్టులోనే గడువు ముగిసిన శీతల పానీయాలు, పండ్ల రసాల బాటిళ్లు ఆరు పెట్టెలు గోదాములో నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో బల్దియా అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన ఆరు నెలలవడంతో డీలరుకు రూ.5 వేల జరిమానా విధించారు. పండగ వేళ ప్రజలు నూనె, వంట సరకులు, శీతల పానీయాలు, తినుబండారాలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా గడువు తీరిన వస్తువులను విక్రయించే అవకాశం ఉంది.. ప్రజలు తేదీ చూసే కొనాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి వస్తువు, పదార్థం ప్యాకింగ్ పై గడువు తేదీ ముద్రించి ఉంటుంది. డీలర్లు టోకుగా కొనుగోలు చేసి కిందిస్థాయి వ్యాపారులకు సరఫరా చేస్తుంటారు. గడువు ముగిసినా.. కొందరు వ్యాపారులు అలాగే విక్రయిస్తుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చూసుకోలేదంటూ బుకాయించి వెనక్కి తీసుకుంటారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఇలాంటివి అనేక ఘటనలు బయటపడుతున్నాయి.
• ఇలాంటివి ఎన్నో :
• కుమురం భీం కాలనీలో గడువు మీరిన పదార్థాలను వినియోగించి ఐస్క్రీమ్ తయారు చేస్తుండగా… పట్టుకొని రూ.5 వేలు జరిమానా విధించారు.
• నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో చెడిపోయిన అల్లం వెల్లులి మసాలాలు తయారుచేసి ప్యాకింగ్ చేసి పట్టుపడ్డారు..
ఉమ్మడిఆదిలాబాద్ జిల్లాలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తాత్కాలిక రుచి కోసం వివరాలు లేని పదార్థాలు, హానికర రసాయనాలు కలుపుతున్నట్లు పలుమార్లు గుర్తించి జరిమానా వేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అన్ని హోటల్లో కల్తీ ఆహార పదార్థాలు మరియు కిరాణా షాపులలో తనిఖీలు నిర్వహించి గడువు తీరిన వస్తువులను విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
