Monday, August 17, 2026
HomeCrimeపెట్రోల్ బంక్ లో నకిలీ నోటు కలకలం.!

పెట్రోల్ బంక్ లో నకిలీ నోటు కలకలం.!

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ హెచ్ పి పెట్రోల్ బంకులో శుక్రవారం రాత్రి నకిలీ నోటు కలకలం సృష్టించింది. నాయకిని పోశం అనే వ్యక్తి కారులో 1000 పెట్రోల్ పోయించుకొని, 2000 ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగిలిన 1000 రూపాయల బ్యాలెన్స్ ఇచ్చారు. అందులో ఒక 200 రూపాయల నోటును వైన్స్ లో ఇవ్వగా అది నకిలీదని తేలింది. తడిపితే దాని రంగు పోయింది. పోశం పెట్రోల్ బంకుకు వెళ్లి అడిగితే, తమకు ఏమీ తెలియదని, ఆ నోటును వేరే కస్టమర్ ఇచ్చారని. మీరేం చేసారో చేసుకోండని బంకు సిబ్బంది. అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. ఏది ఏమైనా మార్కెట్ లో నకిలీ నోట్ల చలామణి దందా జోరుగానే జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. సంబంధిత అధికారులు హెచ్ పి పెట్రోల్ బంక్ పై మరియు ఈ నకిలీ నోట్ల పై దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.