Tuesday, August 18, 2026
HomeCrimeకాంగ్రెస్ నేతపై వాటర్ బాటిళ్లు విసిరేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిళ్లు విసిరేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాస

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా; కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా కేంద్రం జనకాపూర్ రైతు వేదికలో గురువారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ రసాభాసగామారింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవలక్ష్మి , జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ , ఇన్చార్జి డి ఆర్ ఓ లోకేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ లు పాల్గొనగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అదేవిధంగా దొడ్డు బియ్యం పంపిణీ చేశారని , ప్రస్తుత ప్రజా పాలనలో ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేసి, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని చెప్పడంతో వేదిక పైనే ఉన్న ఎమ్మెల్యే కోవలక్ష్మి రేషన్ కార్డులు ఇవ్వడానికి స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం వృద్ధులకు పింఛన్ ను 2000 నుండి 4 వేలకు పెంచుతామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎందుకు పెంచడం లేదని, మీరు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడకూడదని ప్రశ్నించడంతో పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయలేదని అడిషనల్ కలెక్టర్ గా అనడం ఏంటిదని ఆమె మండిపడింది. వేదిక ముందర కూర్చొని ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాం నాయక్ మధ్యలో కల్పించుకొని బాధ్యతవంతమైన పదవిలో ఉండి ఇలా అధికారులపై మాట్లాడడం ఏమిటని ఆయన అనడంతో సహనాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి అసలు ఈ సమావేశానికి నువ్వెందుకు వచ్చావని, నీకేం పని అని ఏం ప్రోటోకాల్ ఉందని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఎమ్మెల్యే టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ లను తీసుకొని అజ్మీర శ్యాం నాయక్ పైన విసిరేయడంతో ఇద్దరి మధ్య నువ్వ నేనా అన్నట్లుగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోగా కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నేలకొంది. నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్ అనుచరులు సైతం ఎమ్మెల్యే కోవలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉన్న కోవలక్ష్మి తనపై వాటర్ బాటిల్లతో దాడి చేయడం సిగ్గుచేటు రాజకీయంగా ఏదైనా ఉంటే అలాంటి సందర్భాల్లోనే చూసుకోవాలి కానీ ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయకూడదన్నారు.ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని సముదాయించారు. అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం యాదవిధిగా సాగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.