Monday, August 17, 2026
HomeCrimeసారు.. జరా మాకు బస్సు పంపండి.

సారు.. జరా మాకు బస్సు పంపండి.

📰 Generate e-Paper Clip

ఆటోలో పరిమితికి మించి ప్రయాణం

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదర్శ పాఠశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం వందల మంది విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాలకు వస్తుంటారు. గత విద్యా సంవత్సరం ఆర్టీసీ బస్సును కేటాయించింది. ప్రస్తుతం ఆ సౌకర్యం కల్పించకపోవడంతో వందల మంది విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

చందూనాయక్ తండా నుంచి అవసరమే:

టెంబీ మీదుగానే కాకుండా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చే మరో మార్గం చందునాయక్ తండా నుంచి కూడా ఆదర్శ పాఠశాలకు బస్సు ఏర్పాటు చేయడం ఆవశ్యకంగా మారింది. విద్యార్థులు సకాలంలో వెళ్లాలనే తొందరలో ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి వెళ్లడం వలన విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది.. బస్సు లేక మండల, ఇతర మండల గ్రామాల నుంచి తీసుకొచ్చే ప్రైవేటు వాహన చోదకులు పాఠశాల వరకు తీసుకురావడం, తిరిగి తీసుకుపోవడం పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో గిట్టుబాటు కాకపోవడంతో ఛార్జీలు అధికంగానే ఉంటున్నాయి. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతోంది. ప్రస్తుతం బస్సు సౌకర్యం లేకపోవడంతోమండలంలోని గ్రామాలు, చుట్టుపక్కల మండలాల పిల్లలు బడి సమయానికి చేరాలన్న తొందరలో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా కిక్కిరిసి వస్తున్నారు. వాటి టాపులపై, వెనుక భాగంలో వేలాడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.

• బస్సును పునఃప్రారంభించాలి..

బస్సు నడవకపోవడంతో పిల్లలను పాఠశాలకు పంపడం భారంగా మారుతోంది.. సకాలంలో బడికి చేరేందుకు పరిమితికి మించి అందుబాటులోని వాహనాల్లో పంపడం జరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పిల్లల కోసం జరా బస్సును నడపాలి. సారు

కిట్టయ్య, దేగామ

• త్వరలో ఏర్పాటు చేస్తాం..!

బజార్ హాత్నూర్ మండలంలోని టెంబీ, దేగామ, జాతర్ల గ్రామాల మీదుగా విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు నడపడానికి కృషి చేస్తాం.

– ప్రతిమ, డిపో మేనేజర్, ఆదిలాబాద్ 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.