Monday, August 17, 2026
HomeTelanganaబాలికల పాఠశాలకు రక్షణ గోడ నిర్మించండి.!

బాలికల పాఠశాలకు రక్షణ గోడ నిర్మించండి.!

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు తప్పని రక్షణ తిప్పలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా నెన్నేల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం చుట్టూ విద్యార్థులకు రక్షణగా ప్రహరి నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ వాగు పక్కన ఉండటం ఊరికి దూరంగా ఉన్నప్పటికీ పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పశువులు తిరగడం, నిత్యం ఎడ్లబండ్లు, రైతులు పంట పొలాలకు వెళ్లడం, పాఠశాల పరిసర ప్రాంతాల్లో రైతులు తిరుగుతుండడం, వర్షాకాలంలో అంత బురదమయంగా ఉండడం కేజీబీవీ పక్కన పల్లె ప్రకృతి వనం, మరోపక్క వాగు ప్రవాహం, పంట పొలాలు ఉండడంతో వర్షకాలంలో ఇతర క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉంది. వసతి గృహంలో మహిళా విద్యార్థులు, మహిళా సిబ్బంది ఉండడంతో విద్యార్థులకు సిబ్బందికి ఇబ్బందిగా మారాయి. వారికి రక్షణగా పాఠశాల పరిసరాల్లో ప్రహరీ గోడ నిర్మించి వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉన్నత అధికారుల పై ఉంది. ప్రస్తుతం కేజీబీవీ పాఠశాలలో 197 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో 6 నుండి 10వ తరగతితో పాటు ఇంటర్ ప్రవేశాలు కూడా కల్పించే అవకాశం ఉంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

– పద్మ స్పెషల్ ఆఫీసర్ కేజీబీవీ కన్నెపల్లి..

వర్షాకాలంలో వాగు ప్రవహించిన సమయంలో వసతి గృహం చుట్టూ క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉందని, మహిళా విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రహరీ గోడ నిర్మించాలని లేఖలు రాశామని తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.