Monday, August 17, 2026
HomeTelanganaనూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఆర్డిఓ, తాహసిల్దార్

నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఆర్డిఓ, తాహసిల్దార్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, తాండూర్: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచనల మేరకు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని బుధవారం బెల్లంపల్లి ఆర్డిఓ హరికృష్ణ ,తాండూర్ తాసిల్దార్ ఇమ్రాన్ చేతుల మీదుగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు నూతన రేషన్  దుకాణాన్ని ప్రారంభించామని అందుబాటులో ఉన్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సిఐ కుమారస్వామి, మాదారం ఎస్సై సౌజన్య, తాండూర్ గీర్ధావర్ ఏజాదుద్దీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. లబ్ధిదారులు మరియు గ్రామస్తులు అందరూ ఎమ్మెల్యే, కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.