Tuesday, August 18, 2026
HomeCrimeకోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

📰 Generate e-Paper Clip

రామగుండం సిపి ఎం. శ్రీనివాస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష పడటంలో కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా, పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు పాటించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో (కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్) లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు.

కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, గోదావరి ఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, స్పెషల్ బ్ర్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, ఎసిపి ప్రతాప్, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.