Saturday, October 3, 2026
HomeTelanganaరేపు ఆశా వర్కర్లు విధులకు బంద్

రేపు ఆశా వర్కర్లు విధులకు బంద్

📰 Generate e-Paper Clip

ఆశాలను వేధింపులకు గురి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి

ఆంజనేయులు న్యూస్, మంచిరాల జిల్లా: బెల్లంపల్లి శంశీర్ నగర్ యూపీహెచ్ హాస్పిటల్ లో ఆశా డే మీటింగ్ అధికారులు నిర్వహించారు. యూపీహెచ్ సి సూపర్ వైజర్ మధు ఆశా సమ్మక్క ను మీకు పని చెయ్యడం చేతకాదు నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ పదజాలంతో బూతులు తిట్టారు. అక్కడే ఉన్న తోటి ఆశ వర్కర్ స్వరూపను కూడా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు మంచి దానివా? పిచ్చిదానివా అసలు నువ్వు మనిషివా అంటూ ఆడవాళ్లు అని కూడా చూడకుండా చాలా అసభ్య పదజాలంతో సూపర్వైజర్ మధు తిట్టారు .ఈ అధికారి వేధింపులకు సమ్మక్క అను ఆశా వర్కర్ బిపి పెరిగి కింద పడిపోవడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న తోటి ఆశా వర్కర్లు బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడి నుండి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు పరీక్షలు చేశారు. కానీ ఆ ఆశ వర్కర్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చెప్పింది. హార్ట్ బీట్ పెరుగుతుందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రిలో ఆశా వర్కర్ లను దుంపల రంజిత్ కుమార్ సిఐటియు యూనియన్ జిల్లా కార్యదర్శి పరామర్శించి అనంతరం జరిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కి చేరవాణి ద్వారా చెప్పడం జరిగింది.

జిల్లా కలెక్టర్ దీనిపైన  విచారణ చేసి బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశాల పట్ల వేధింపులకు గురి చేస్తున్న సూపర్ వైజర్ మధు నీ వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని, జిల్లాలో ఆశల పట్ల అధికారుల వేధింపుల ఆపాలని, ఆ అధికారి వేధింపులను నిరసిస్తూ  రేపు ఆశ వర్కర్లు విధులకు హాజరు కాకుండా బంద్ చేపడుతు, జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.