Monday, August 17, 2026
HomeCrimeవిచ్చలవిడిగా కుళ్లిన ఆహారం అమ్మకాలు

విచ్చలవిడిగా కుళ్లిన ఆహారం అమ్మకాలు

📰 Generate e-Paper Clip

ఆహార భద్రత నియంత్రణ అధికారుల నిర్లక్షం

ఆంజనేయులు న్యూస్, వరంగల్: బిర్యానీ సెంటర్ లపై తనిఖీలు నిర్వహించని ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాజీపేట మండలంలో కాజీపేట పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న ఓ బిర్యాని సెంటర్లో కుళ్ళిన బిర్యాని తిని వాంతులు విరోచనాలై కూలీలు ఆసుపత్రి పాలైన సంఘటన కాజీపేటలో చోటుచేసుకుంది  కూలీలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట చౌరస్తాలో ఆద్విక బిర్యాని హోటల్ లో గురువారం ఉదయం పదిమంది కూలీలు బిర్యాని కోసం  హోటల్ కి రావడం జరిగింది హోటల్ సిబ్బంది ముందురోజు వండిన కుళ్లిన బిర్యాని అమ్మడం తో బిర్యాని  పార్శల్ తీసుకుని తిన్న పదిమంది కూలీలలో ఎనిమిది మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయని తోటి కూలీలు అదే రోజు సాయింత్రం అద్విక ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ కు వచ్చి అడుగగా ఆ హోటల్ యజమాని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటు నిర్లక్ష్యపు సమాధానం చెప్పగా బాధితులు 100కు ఫోన్ చేసి వారి బాధను వెళ్లగక్కిన వెంటనే  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూశారు.  పోలీసులు వివరాలు తెలుసుకునీ పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కూలీలను పోలీస్ స్టేషన్ పంపించినట్లుగా సమాచారం. ఈలాంటి వాటిపై ఫూడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేసి తగు న్యాయం చేయాలని కూలీలు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.