Tuesday, August 18, 2026
HomeTelanganaఈ.వి.ఎం.ల భద్రత దిశగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఈ.వి.ఎం.ల భద్రత దిశగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లోక్‌సభ ఎన్నికలు-2024 లో భాగంగా 002-పెద్దపల్లి (ఎస్‌. సి.) పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 002- చెన్నూర్‌ (ఎస్‌. సి.), 003-బెల్లంపల్లి (ఎస్‌. సి.), 004-మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 13న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ కార్యక్రమం ఉంటుందని, ఈ క్రమంలో స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈ.వి.ఎం. రక్షణ కొరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం ముల్కల లోని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో గల స్ట్రాంగ్ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు కంట్రోల్‌ రూమ్‌లను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ. లోక్‌సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసిందని, జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ కార్యక్రమం ఉంటుందని, 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ కార్యక్రమం కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, కంట్రోల్‌ రూమ్‌, మీడియా సెంటర్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.