Wednesday, August 19, 2026
HomeTelanganaపోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా 002-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 002-చెన్నూర్ (ఎస్.సి.), 003–బెల్లంపల్లి (ఎస్.సి.), 004- మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ గడువు ముగుస్తున్నందున దరఖాస్తు చేసుకుని ఇప్పటి వరకు వినియోగించుకోని ఆఖరు రోజు అయినందున ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన శాసనసభ నియోజకవర్గ ఎన్నికల మాదిరిగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేనందున ఈ నెల 8వ తేదీన ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో పాటు జిల్లాలో 3 ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.