Monday, August 17, 2026
HomeTelanganaతాండూరు ఎస్ఐ సస్పెన్షన్

తాండూరు ఎస్ఐ సస్పెన్షన్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, తాండూర్, మంచిర్యాల జిల్లా: పీడీఎస్ రైస్ అక్రమ దందా కేసు వ్యవహారంలో దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. ఎన్నికల నిర్వహణతో పాటు, నేర సమీక్షకు రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్ 1 ఐజీ పీడీఎస్ రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో తాండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.