Tuesday, August 18, 2026
HomeTelanganaఅడవులు, ప్లాంటేషన్ లు కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం

అడవులు, ప్లాంటేషన్ లు కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం

📰 Generate e-Paper Clip

ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా, జైపూర్: సహజసిద్దంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్ లు మానవ నిర్లక్ష్యం తో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ -I ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ అన్నారు. శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో మంచిర్యాల రేంజ్ -II ప్లాంటేషన్ మేనేజర్ ఇ.లక్ష్మణ్ తో కలిసి గ్రామస్థులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేసవి కాలంలో అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే వారిలో కొందరు బీడీలు, సిగరెట్ లు తాగి నిర్లక్ష్యం తో పడేయడం వల్ల అడవికి నిప్పు అంటుకునే ప్రమాదాలు ఉన్నాయన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అడవులు, ప్లాంటేషన్ లు కాలితే  అవి ప్రాణ వాయువు ఆక్సిజన్ ను విడుదల చేయలేవని, తద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. దీంతో మానవాళి మనుగడతో పాటు ఇతర జీవరాశుల కు నష్టం కలుగుతుందన్నారు. చెట్లు సమృద్ధిగా పెరిగితే మంచి వర్షాలు వస్తాయని, కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత ను కాపాడతాయన్నారు. కావున అడవులలో, ప్లాంటేషన్ లలో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి సామాజిక భాద్యత గా మంటలు అర్పివేయాలన్నారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు సురేష్ కుమార్, లక్ష్మణ్ లతో పాటు ఫీల్డ్ సూపర్ వైజర్ లు రాజేష్, శ్రీనివాస్, వాచర్ లు శంకర్, సాయికిరణ్, లచ్చన్న, ఓదెలు, రాకేష్, సాయికృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.