Tuesday, August 18, 2026
HomeTelanganaజిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి

నాట్య కళకే అలంకరణగా నిలుస్తున్న అన్నం కల్పన M.A కూచిపూడి శ్రీ నందిని నృత్యాలయం

నాట్య గురువు అన్నం కల్పన కు శిష్య బృందానికి అవార్డుతో సత్కారం సన్మానం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ కూచిపూడి నృత్యం ఫెస్టివల్ ను విజయవాడ శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా “డాక్టర్ వేదాంతం రాజేశం మాస్టర్ కూచిపూడి లెజెండరీ” హాజరయ్యారు.. ఈ నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నేషనల్ లెవెల్ డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి శ్రీ అన్నం కల్పన గారి శిష్య బృందం హర్షిత, మనస్వి, నికిత, వైనవి, యోగిత, నక్షత్ర, శ్రీవల్లి, సమన్విత, చరణ, భువనకృత,  శ్రీజ,  అవంతిక, సాధిక, అలోఖి, యశ్వశ్రీ, ప్రవస్తి, శ్రీనిక, హిరణ్య, జ్ఞాపిక, అభిజ్ఞ శ్రీ, హ్రీతికాంజని, సృష్టి, చైత్ర, సిరివెన్నెల, సాన్వి, గీతిక, ఎం చైత్ర, రూపాచౌదరి, అక్షర శ్రీ, ఒజెస్వీ, వినుజ, దీపాలి, శ్రీకరి, తనుజ, అమర్త్య, షణ్ముఖ, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చెశారు. వారి ప్రతిభను గుర్తించి. “నాట్య మంజరి అవార్డు” ను ప్రధానం చెసారు.. అనంతరం గరువు అన్నం కల్పన ను “కళా సౌరభ అవార్డ్” తో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.