Wednesday, August 19, 2026
HomeTelanganaప్రజలు పౌర హక్కులు, అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ప్రజలు పౌర హక్కులు, అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల  జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలు పౌర హక్కులు, ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ చట్టంపై అవగాహన ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి.సి.పి, సుధీర్ రామ్నాథ్ కేకన్, మంచిర్యాల, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి. రాములు, మంచిర్యాల, జైపూర్ ఎ.సి.పి.లు తిరుపతిరెడ్డి, మోహన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డితో కలిసి ఎస్.సి., ఎస్.టి., అట్రాసిటీపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని, చట్టంపై ప్రజల్లో పూర్థి స్థాయి అవగాహన కల్పించాలని, ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. 2016లో జిల్లా ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు 2012 నుండి 2022 వరకు వివిధ కేసులలో 447 మంది బాధితులకు 4 కోట్ల 75 లక్షల 44 వేల 750 రూపాయల పరిహారం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కమిటీ సభ్యుల ప్రతిపాదన మేరకు మందమర్రి మండలం ఎర్రగుంటపల్లెలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టాపులను మూసి వేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం అప్రోచ్ రోడ్ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యాచార నిరోధక చర్యలు, నిబంధనలు తెలిపే విధంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 3 రోజులలోగా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే దిశగా ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జి.ఓ. నం. 29 ప్రకారం నమోదైన ప్రత్యేక కేసులలో సమగ్ర విచారణ జరిపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ నెల 30, 31 తేదీలలో సివిల్ రైట్స్ డే నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో గ్రామాలలో సివిల్ రైట్స్ డే సందర్భంగా నిర్వహించే సభలలో పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని, రాజస్వ మండల అధికారి పర్యవేక్షించాలని, ఆయా మండలాల తహశిల్దార్ల సమన్వయంతో గ్రామసభల వివరాలు అందిరికీ తెలిసే విధంగా నిర్దిష్ట సమయానికి ముందు నుండి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురపాలక సంఘాల పరిధిలో సివిల్ రైట్స్ డే సభలను నిర్వహించడం కమీషనర్లు బాధ్యతగా తీసుకోవాలని, ఈ సభలకు అందరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్రైమాసికంలో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు వేదికలకు సంబంధించిన వివరాలు కమిటీ సభ్యులకు, నాయకులకు తెలియజేయాలని అన్నారు. నమోదైన కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కళాజాత ద్వారా సివిల్ రైట్స్ డే, పౌరహక్కులు, అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం డి.సి.పి. మాట్లాడుతూ..

బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు విచారణతో పాటు ఎఫ్.ఐ.ఆర్. ప్రక్రియ వేగవంతం చేసేందుకు సంబంధిత ఎస్. హెచ్. ఓ.లు, సి.ఐ., ఎస్.ఐ.ల సమన్వయంతో విచారణ ప్రక్రియ వేగంగా జరుపుతామని, సివిల్ రైట్స్ డే సందర్భంగా స్థానిక సి.ఐ., ఎస్.ఐ.లు గ్రామసభలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎఫ్.ఐ.ఆర్. స్థాయిలో 25 శాతం, చార్జ్ షీట్ కోర్టుకు పంపినప్పుడు 50 శాతం, న్యాయస్థానంలో నిందితుడు నేరాన్ని అంగీకరించినప్పుడు 25 శాతం పరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేశం, ఐచ్చల అంజయ్య, కె.సత్యనారాయణ, రేగుంట లింగయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డి. మాధవన్, ఎం.సరోజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.