Tuesday, August 18, 2026
HomeTelanganaఉత్తమ కూచిపూడి నాట్య గురువు అవార్డు ప్రధానం

ఉత్తమ కూచిపూడి నాట్య గురువు అవార్డు ప్రధానం

📰 Generate e-Paper Clip

నాట్య కళకే అలంకరణగా నిలుస్తున్న అన్నం కల్పన (M.A కూచిపూడి) శ్రీ నందిని నృత్యాలయం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చేతుల మీదుగా ఉత్తమ నాట్య గురువు అవార్డు ను అందుకుంటున్న అన్నం కల్పన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో బాలుర పాఠశాల మైదానంలో శనివారం జరిగిన 75వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, నాట్య విభూషని, డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత అన్నం కల్పన MA కూచిపుడి కు ఉత్తమ కూచిపూడి నాట్య గురువు గా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంను అందుకున్నారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రాహుల్, డిసీపీ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఒ ఆసీస్ సింగ్ ఉన్నారు..
నాట్య గురువు అన్నం కల్పన కూచిపూడి నృత్యంలో మరియు తెలుగు లిటరెచ్ లోను ఎంఎ పట్టా పొందారు. డ్రాయింగ్ లో హైయర్ డిప్లమా చేసి టి.టి.సి పూర్తి చేశారు. కూచిపూడి, శాస్త్రీయ నృత్యం జానపదం కలలలో నైపుణ్యత సాధించారు ఇదే స్ఫూర్తితో మంచిర్యాల జిల్లాలో శ్రీ నందిని నృత్యాలయం ను స్థాపించి గత 25 సంవత్సరాలు నిరంతరంగా నృత్యం శిక్షణ ఇస్తూ ఇప్పటివరకు 10వేల మంది నృత్య కళాకారులకు కళా విద్యను అందించి జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో అనేక నృత్య ప్రదర్శనలు చేశారు. వీటితోపాటు చిత్రలేఖనంలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుచుకున్నారు. వారి అవార్డులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు, నాట్య విభూషణి, నాట్య సరస్వతి, నాట్య మయూరి, నాట్య శిరోమణి, నాట్య నృత్యమాల, నాట్య కీర్తి, అభినవ సత్యభామ, గజ పద్మమాల, గురుదేవోభవ, ఉత్తమ కూచిపూడి నాట్య కళాకారణి, ఉత్తమ నాట్య గురువు, లతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు.. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరిగే యూత్ ఫెస్టివల్ కు ఎన్నోసార్లు న్యాయ నిర్ణయితలుగా కూడా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐదు సార్లు గిన్నిస్ రికార్డు సాధించారు. వీటితోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డును కూడా సాధించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.