Monday, August 17, 2026
HomeTelanganaపెరిక సంఘం అధ్యక్షుడిగా అంజయ్య ఏకగ్రీవం

పెరిక సంఘం అధ్యక్షుడిగా అంజయ్య ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పురగిరి క్షత్రియ పెరిక సంఘం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ అధ్యక్షుడిగా కుదిరే అంజయ్య ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇట్టి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పెరిక సంఘం రాష్ట్ర నాయకులు తోంగల సత్యనారాయణ, డాక్టర్ రఘునందన్, డాక్టర్ రాజ్ కిరణ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పెరికలు రాజకీయంగా ముందుండి కొట్లాడె సమయం ఆసన్నమైంది పెరిక కులస్తులుఏకతాటి మీదికి వచ్చి రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో  పెరిక కులస్తులు గ్రామాల్లో పోటీ చేసినట్లయితే మన వంతుగా ఆయా గ్రామాలకు వెళ్లి మనం వారికి మద్దతు ఇవ్వాలని ఇకనుండి కులస్తులకు అన్యాయం జరిగినట్లైయితే పెరిక కులస్తులు ముందుండి కొట్లాడాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మందమర్రి మండల మరియు పట్టణ నాయకులు శ్రీధర్ల మల్లేష్, దుమ్మని సత్తయ్య, అప్పని నాగయ్య, దుమ్మటి కుమార్, మోట పలుకుల సురేందర్, యూత్ నాయకులు ఉగ్గే కిరణ్ కుమార్ మరియు కుల బాంధవులందరు పాల్గొని ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేశారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.