జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్, ముథోల్ స్థానాలను భాజపా, ఖానాపూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో భారాస పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా ‘చేయి’ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ‘కారు’ దిగి ‘హస్తం’ గూటికి చేరేందుకు నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్ తోపాటు మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లాలోని సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
