కారుకు బైబై.. చేయికి సై..!

జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్, ముథోల్ స్థానాలను భాజపా, ఖానాపూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో భారాస పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా 'చేయి' పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 'కారు' దిగి 'హస్తం' గూటికి చేరేందుకు...