Monday, August 17, 2026
HomeTelanganaచెన్నూర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటా

చెన్నూర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటా

📰 Generate e-Paper Clip

చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్

ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం కొత్తపల్లిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో భీమారం మండలం లో ఉన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. భీమారం ప్రజలు ఏం తప్పు చేశారు,వారికి ఎందుకు అభివృద్ధి పథకాలు అందలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఏ బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెన్నూరు నియోజక వర్గం ప్రజలను అభివృద్ధికి నోచుకోనివ్వలేదో ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత చెన్నూరు నియోజకవర్గ ప్రజలపై ఉందని తెలియజేశారు. ప్రజలందరూ మోసపూరితమైన మాటలు నమ్మకుండా, డబ్బులకు, కానుకలకు లొంగకుండా నిజంగా ప్రజలకు మేలు చేసే  బిజెపి ప్రభుత్వాన్ని గెలుపు దిశగా ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు 24 గంటలు ఒక శ్రామికుని వలె అందుబాటులో ఉంటూ అభివృద్ధి బాటలో చెన్నూరుని ఉంచుతానని ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.