Tuesday, August 18, 2026
HomeCrimeమావోల లేఖ.! కేసీఆర్‌పై సంచలన కామెంట్స్.?

మావోల లేఖ.! కేసీఆర్‌పై సంచలన కామెంట్స్.?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, వరంగల్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ  విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్  వహించాలన్నారు. మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించి కేవలం మూడు సంవత్సరాలే అయిందని. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న ప్రారంభించారని తెలిపారు. ఈ బ్యారేజీ త్వరలోనే కూలి పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమే అని లేఖలో తెలిపారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని విమర్శించారు. అది నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసు ఫోర్స్‌తో ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. విషయం బయటకు రాకుండా అణిచివేశారని. మీడియాను కూడా బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.