Tuesday, August 18, 2026
HomeTelanganaఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ లో గల శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాలలో గురువారం శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రజినీ మాట్లాడుతూ… అష్టమి రోజున కృష్ణుడు జన్మించాడని, చెడుపై మంచిని సాధించే చిహ్నంగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై వెలసిన కృష్ణావతార దినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం అన్నారు. విద్యార్థులంతా మత సామరస్యం కలిగి ఉండాలని, పండుగలను అందరూ కలసి జరుపుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులు, జాతి సమైక్యత దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. దాదాపు 200 లకు పైగా చిన్నారులు, కృష్ణుడు, గోపిక ల వేష ధారణలో అభినయంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో సభాసదస్యులను, తల్లిదండ్రులను ఆకర్షించారు. ముద్దులొలికే కృష్ణుని పాటలతో పాఠశాల ప్రాంగణం కరతాళ ధ్వనులతో వెళ్లి విరిసింది. తదనంతరం విద్యార్థులు ఉట్టి కట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంలో ముందు రోజు పాల్గొన్న చిన్నారులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన వారికి బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.