Tuesday, August 18, 2026
HomeTelanganaఆశల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

ఆశల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

📰 Generate e-Paper Clip

సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయు) ఆధ్వర్యంలో బుధవారం రోజున ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో రాజేశ్వర రావు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… ఆశాల సమస్యలనుపరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పారితోషకం పేరుతో ఆశాలను శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. కనీస వేతనం లేదు. ఉద్యోగ భద్రత లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆశాల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం సమ్మక్క ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ..రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు  వైద్యం సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు అందించడంలో మరియు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు  వైద్యం అందించాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. ప్రభుత్వం స్పందించి మాకు ఫిక్స్డ్ వేతనం 26వేలు నిర్ణయించి చెల్లించాలి. 25 లక్షల ప్రమాద భీమా సౌకర్య కల్పంచాలి.మాకు అవసరమైన 35 రిజిస్టర్ లు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. పెండింగ్ లెప్రసీ, ఎండిఏ మరియు ట్రేనింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి. కరోనా సమయంలో రిస్క్ అలావెన్స్ లు 19 వేలు చెల్లించాలి. అర్హులైన ఆశాలను ఎఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలి.ప్రసూతి సెలవులతో కూడిన వేతనం చెల్లించాలి. ఈ కార్యక్రమంలో లీలా, భాగ్య, రాణి జిల్లా కమిటీ సభ్యులు, అనురాధ, వెంకటలక్ష్మి, నాగుబాయ్, లావణ్య జిల్లా కమిటీ సభ్యులు, పుష్పలత సుమలత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.