Wednesday, August 19, 2026
HomeTelanganaరానున్న ఎన్నికలలో మంచిర్యాల నుండి బీసీ అభ్యర్థిగా రాపోలు విష్ణు వర్ధన్

రానున్న ఎన్నికలలో మంచిర్యాల నుండి బీసీ అభ్యర్థిగా రాపోలు విష్ణు వర్ధన్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అత్యధిక బీసీ జనాభా ఉన్న  మన మంచిర్యాల నియోజకవర్గంలో  ఈసారి బీసీలకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల నుండి బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా జిల్లా అధ్యక్షులు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ జిల్లా కన్వీనర్ రాపోలు విష్ణువర్ధన్ రావు కి అవకాశం కల్పించాలని తెలంగాణ బహుజన విద్యావంతుల వేదిక నాయకులు కస్తూరి పద్మచరణ్,  మద్దెర్ల శ్రీనివాస్,  ఉదారి చంద్రమోహన్ గౌడ్, దామెర్ల సిద్దయ్య, ఉస్మాన్ పాష లు  ఐబీ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాపోలు విష్ణువర్ధన్ రావు సుమారు మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో ఉండి ఓ ప్రైవేటు విద్యాసంస్థను నిర్వహిస్తున్నారని, యువకులు, విద్యావంతులు, మేధావులు ఎన్నికల బరిలో నిలిచి గెలిచినప్పుడే మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తిగా, గత 25 సంవత్సరాలుగా పలు ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కళాశాలలో మరియు వివిధ పాఠశాలలో పనిచేసి కొన్ని వేల మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాల అభిమానం పొందిన వ్యక్తిగా, సింగరేణి కార్మిక కుటుంబం నుండి వచ్చినందున కార్మికుల కష్టసుఖాలు గురించి అవగాహన కలిగిన వ్యక్తిగా  మరియు స్థానికుడు కావడం వలన రాపోలు విష్ణువర్ధన్ రావు కు అవకాశం కల్పించాలని వారు కోరారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రైవేట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేశారని,  ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉందని, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా జిల్లా అధ్యక్షునిగా మరియు కేజీ టు పీజీ ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ జిల్లా కన్వీనర్ గా కొనసాగుతున్నారని, అదేవిధంగా అనేక సంఘాలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారని వారు అన్నారు. క్రీడా రంగంలో  జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా, జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడే వ్యక్తిగా మంచి పేరు ఉందని, కరోనా విపత్తు కాలంలోజిల్లాలో సుమారు ఐదు వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు,  డ్రైవర్లకు, ఆయాలకు మరియు ఇతర బోధనేతర సిబ్బందికి నిత్యావసర సరుకులు పంచి వారికి చేదోడు వాదోడుగా నిలిచారని అన్నారు.
2018 అసెంబ్లీ ఎలక్షన్లలో తమ పార్టీ తరపున నిలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించినట్టు వారు తెలిపారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో విష్ణువర్ధన్ రావు కు టికెట్ ఇస్తే చాలా కాలం నుండి  విద్యా రంగంలో  ఉండడం వలన  విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్లు, సింగరేణి కార్మిక కుటుంబం నుండి రావడం మరియు 40 సంవత్సరాలనుండి ఇక్కడే జీవించడం వలన కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు, యువత ఓట్లు మరియు బీ సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలన బీ సీ ఓట్లు మరియు క్రీడా రంగంతో అనుభందం ఉండటం వలన క్రీడాకారుల ఓట్లు కూడా వస్తాయని వారు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని కేజీ టు పీజీ  విద్యాసంస్థల అధినేతలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి  విద్యాసంస్థల నుండి బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, కోల్ బెల్ట్ వాసి, విద్యావంతుడు విష్ణువర్ధన్ రావు కు టికెట్ ఇస్తే విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు,మేమందరం కలిసి తిరిగి గెలిపించుకుంటామని ఒక మెమొరాండం తయారుచేశామని,త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి రాపోలు విష్ణు వర్ధన్ రావు కు టికెట్ ఇవ్వాలని కోరుతామని వారు తెలిపారు.  ఒకవేళ ఏ పార్టీ ముందుకు రాకపోయినా మేమందరం ప్రజలు, మేధావులు, విద్యావంతులు, బీసీ సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్ గా నిలబెడుతామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ జిల్లా కన్వీనర్ రాపోలు విష్ణువర్ధన్ రావు, ప్రైవేట్ విద్యా సంస్థలు జేఏసీ కో కన్వీనర్ మరియు తెలంగాణ బహుజన విద్యా వంతుల వేదిక నాయకులు డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ట్రస్మా  రాష్ట్ర ఉపాధ్యక్షులు కస్తూరి పద్మచరణ్, దామెర్ల సిద్ధయ్య, డిగ్రీ కళాశాలల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.రమణ,  ట్రస్మా నస్పూర్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, అప్పని తిరుపతి, దండేపల్లి మండల అధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మీనారాయణ, మందమరి మండల అధ్యక్షుడు పోలు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి ఉప్పలయ్య, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు రాజలింగు  ట్రస్మా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తెలంగాణ విద్యావంతుల వేదిక మైనార్టీ సెల్ నాయకులు ఉస్మాన్ పాష, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ విక్రమ్ రావు, జుల్ఫికర్ అహ్మద్, రమేష్, జిల్లా స్పోర్ట్స్ సెక్రెటరీ పెంచాల శ్రీధర్ జిల్లా నాయకులు శేఖర్, మోహన్ వర్మ, సాదిక్, ఉపాధ్యాయులు ప్రశాంత్,  వేణు,  తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.